ఐక్యతాభావంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2021-08-10T07:33:46+05:30 IST

యువత ప్రధానిమోడీని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యతభావంతో ముందుకు సాగాలని తమిళనాడుకు చెందిన మందా రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు.

ఐక్యతాభావంతో ముందుకు సాగాలి
మాట్లాడుతున్న రాజ్యలక్ష్మి

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 9 : యువత ప్రధానిమోడీని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యతభావంతో ముందుకు సాగాలని తమిళనాడుకు చెందిన మందా రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన బైక్‌ర్యాలీ ఏక్తాయాత్ర నిర్మల్‌కు చేరింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... యువత పక్కదారి పట్టకుండా దేశభక్తి జాతీయభావాలు పెంపొందించుకోవాలన్నారు. కుల,మతాలకతీతంగా దేశప్రజలు ఐక్యత చాటాలని అన్నారు. మధురై నుండి మనాలి హిమాచల్‌వరకు 4450 కిలోమీటర్ల బైక్‌ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నిర్మల్‌కు వచ్చిన ఆమెకు గోదావరి, కృష్ణా జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ స్వాగతం పలికారు. ఆమె వెంట లీగల్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సౌత్‌ ఇండియా ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు ప్రవీణ్‌ ఉన్నారు. బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రాచకొండసాగర్‌, ఒడిసెల అర్జున్‌, వెంకటేష్‌, అల్లం భాస్కర్‌, శ్రీనివాస్‌రావు తదితరులున్నారు. 

Updated Date - 2021-08-10T07:33:46+05:30 IST