కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-12-27T03:48:57+05:30 IST

క్రీడాకారులు కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు

కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రాణించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, డిసెంబరు 26:  క్రీడాకారులు కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణం లోని సింగరేణి కళావేదికలో ఆదివారం నిర్వహించిన సౌత్‌ జోన్‌ లెవెల్‌ కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. విద్యార్ధి దశ నుంచే కరాటే, కుంగ్‌ఫూ నేర్చు కోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి బహుమతు లు సాధిం చాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో టోర్నమెంట్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ మోహన్‌, టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంజ య్‌కుమార్‌, రిటైర్డు డీఎస్పీ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T03:48:57+05:30 IST