శనగలను కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-03-25T05:11:34+05:30 IST
యాసంగిలో రైతులు సాగు చేసిన శనగ పంటను ఎకరానికి తొమ్మిది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బోథ్ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్ బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి విన్నవించారు.

బోథ్, మార్చి 24: యాసంగిలో రైతులు సాగు చేసిన శనగ పంటను ఎకరానికి తొమ్మిది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బోథ్ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్ బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి విన్నవించారు. ప్రభుత్వం ఎకరానికి 5క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవానికి ఈ యేడాది రబీకి అనుకూలమైన వాతావరణం ఉండడంతో 9 నుంచి 12క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు. దీంతో మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్మాలో తెలియక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్ట పోవాల్సి వస్తుందని వివరించారు. ఆయన వెంట బోథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుంజల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాథోడ్‌రాయల్, రవియాదవ్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.