మద్యం మత్తులో ఒకరి హత్య

ABN , First Publish Date - 2021-03-22T06:45:19+05:30 IST

మద్యం మత్తులో తాపీ మేస్ర్తీ దారుణ హత్యకు గురైన ఘటన ఖానాపూర్‌లో చోటు చే సుకుంది. పట్టణ సీఐ శ్రీధర్‌ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన కడి యాల హన్మంతురావు, గోరంట్ల బాపూ జీ, కనపర్తి భిక్షా అనే ముగ్గురు తాపీ మే

మద్యం మత్తులో ఒకరి హత్య
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఇంట్లో భోజనం చేస్తుండగా తాపీ మేస్ర్తీల మధ్య వివాదం

తోటి మేస్ర్తీపై ఇనుపరాడ్‌తో దాడి చేసిన గోరంట్ల బాపూజీ

అక్కడికక్కడే మృతి చెందిన కడియాల హన్మంతురావు

ఖానాపూర్‌, మార్చి 21: మద్యం మత్తులో తాపీ మేస్ర్తీ దారుణ హత్యకు గురైన ఘటన ఖానాపూర్‌లో చోటు చే సుకుంది. పట్టణ సీఐ శ్రీధర్‌ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన కడి యాల హన్మంతురావు, గోరంట్ల బాపూ జీ, కనపర్తి భిక్షా అనే ముగ్గురు తాపీ మేస్ర్తీలు ఖానాపూర్‌లో ఓ మేస్ర్తీ వద్ద పనికి వచ్చారు. పట్టణంలోని విద్యానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ మండ లంలోని రాజూరా, కడెం మండలంలోని సారంగాపూర్‌ గ్రామాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులకు నిత్యం వెళ్తున్నారు. కాగా, ఆదివారం సెలవుదినం కావడంతో ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు. ఇంట్లో భోజనం సిద్ధం చేసుకున్న అనంతరం బాపూజీ, హన్మంతురావు బయటకు వెళ్లి మద్యం తాగి తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భిక్షా బయటకు వెళ్లాడు. ఆ ఇద్దరు ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్యలో వివాదం తలెత్తింది. దీంతో బాపూజీ ఇనుపరాడ్‌తో హన్మంతురావు తలపై దాడి చేశాడు. దీంతో హన్మంతురావు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఖానాపూర్‌ సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రామునాయక్‌లు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితున్ని విచారించిన అనంతరం వారి మధ్య జరిగిన వివాదం గురించి వెల్లడిస్తామని వారు తెలిపారు. 

Updated Date - 2021-03-22T06:45:19+05:30 IST