గంటకో తీరు...!

ABN , First Publish Date - 2021-12-27T04:41:05+05:30 IST

టీచర్ల విభజనకు సంబంధించి కేటాయింపుల వ్యవహారం ఉత్కంఠనే కొనసాగిస్తోంది. పుట్టిన నాటి నుం చి నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి పొరుగు జిల్లాలకు స్థానికేతరులుగా బదిలీ కానున్న వ్యవహారాన్ని తలుచుకుంటూ వందల మంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్తున్న టీచర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనవుతున్నారు. కా గా, సీనియార్టీ జాబితా రూపకల్పనపై అడుగడుగునా పొరపాట్లు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయని కొంతమంది డీఈవో కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, అ ధికారులు సీనియార్టీ జాబితాలను చివరి వరకు సవరించారన్న ఫిర్యాదు లు వ్యక్తమవుతున్నాయి. కేటాయించబడిన జిలా ్లల్లో కూడా రూపొందించిన అక్కడి సీనియార్టీ జాబితాలో కూడా పొరపాట్లు జరిగాయన్న ఆరోపణలున్నాయి.

గంటకో తీరు...!
జిల్లా విద్యాశాఖ కార్యాలయం

టీచర్ల సీనియార్టీ జాబితా, జిల్లాల కేటాయింపులపై  అనుమానాలు 

చివరి వరకు కొనసాగిన మార్పులు, చేర్పులు 

తప్పిదాలు జరిగాయంటూ టీచర్ల ఆరోపణలు 

నేటి నుంచి స్థానికేతరులుగా మారనున్న స్థానికులు 

నిర్మల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టీచర్ల విభజనకు సంబంధించి కేటాయింపుల వ్యవహారం ఉత్కంఠనే కొనసాగిస్తోంది. పుట్టిన నాటి నుం చి నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి పొరుగు జిల్లాలకు స్థానికేతరులుగా బదిలీ కానున్న వ్యవహారాన్ని తలుచుకుంటూ వందల మంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్తున్న టీచర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనవుతున్నారు. కా గా, సీనియార్టీ జాబితా రూపకల్పనపై అడుగడుగునా పొరపాట్లు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయని కొంతమంది డీఈవో కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, అ ధికారులు సీనియార్టీ జాబితాలను చివరి వరకు సవరించారన్న ఫిర్యాదు లు వ్యక్తమవుతున్నాయి. కేటాయించబడిన జిలా ్లల్లో కూడా రూపొందించిన అక్కడి సీనియార్టీ జాబితాలో కూడా పొరపాట్లు జరిగాయన్న ఆరోపణలున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో.. 

నిర్మల్‌ జిల్లాతో పాటు మిగతా ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న జిల్లాలో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగిట్లు ఆరోపణలున్నాయి. కాగా అదికారులు జిల్లాలోని ఖాళీలన్నింటిని ప్రస్తుతం పక్కన పెట్టి కేవలం ఆలోకేషన్‌ పేరిట ఇక్కడి నుంచి పొరుగు జిల్లాలకు బదిలీ అయిన పోస్టులను చూపుతుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అధికారులు రోజుకో రీతిన ఉమ్మడి జిల్లా అలాగే కేటాయించిన బడిన జిల్లాల్లో సీనియార్టీ జాబితాలు రూపొందించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు,  కొందరు యూనియన్‌ నాయకుల చేతివాటం కారణంగానే అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 

యూనియన్‌ల వ్యవహార శైలిపై ఆరోపణలు.. 

పది రోజుల నుంచి సీనియార్టీ జాబితాలో జూనియర్‌గా ఉన్న ఏ ఒక్క టీచర్‌కు కూడా నిద్రరాని పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లలు ఉన్న టీచర్ల పరిస్థితి వర్ణణాతీతం. జీవితంలో స్థిరపడ్డామని ఆనందిస్తున్న సమయంలోనే ప్రభుత్వం తమ జీవితాలను ఆడుకుంటుందని పలువురు రోఽధిస్తూ చెబుతున్నారు. ఈదశలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అండగా ఉండాల్సిన ఉపాఽధ్యాయ సంఘాలు స్పందించకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. ఒకటి, రెండు సంఘాలు మాత్రం ఈ వ్యవహారంపై సీరియస్‌గానే స్పందిస్తున్నప్పటికీ కీలకమైన యూనియన్‌లు నోరు మెదపకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది యూనియన్‌ నాయకులు తమ కు అనుకూలమైన వారి కోసం సీనియార్టీ జాబితాను తలకిందులు చే యించుకున్నారనే ఆరోపణలున్నాయి.

అంతటా ఉత్కంఠ

టీచర్లకు స్థానికేతరులుగా విభజించి పొరుగు జిల్లాలను కేటాయించినప్పటికీ సీ నియార్టీ జాబితాలపై ఆరోపణలున్నాయి. అప్పటికప్పుడే జాబితాలు తలకిందులు కా వడం, పెద్దమొత్తంలో సవరణలు చోటు చేసుకోవడం వంటి అంశాలు సందేహాలకు ఆ స్కారమిస్తోంది. తమకు అందిన విజ్ఞప్తుల మే రకే అన్ని పరిశీలించి అర్హులైన వారికి అన్యా యం జరగకుండా చూస్తున్నామే తప్పా తప్పిదా లు జరగడం లేదని అధికారులు సమర్ధించుకుంటున్నారు. ఆగమేఘాల మీద సీనియార్టీ జాబితా లు తయారు చేయడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. తాము తప్పిదాలు జరిగాయని విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకుండా సిఫారసులు, పైరవీలు చేసిన వారికే సవరణల్లో అవకాశం కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా.. 

నిర్మల్‌ జిల్లా నుంచి మంచిర్యాల, కొమురం భీం జిల్లాలకు స్థానికేతరులుగా బదిలీ అవుతుండడాన్ని చాలామంది టీచర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఎస్‌జీటీలుగా సీనియర్లమైనప్పటికీ ఆ సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా ప్రమోషన్‌ సీనియార్టీని మాత్రమే లెక్కించి తమను స్థానికేతరులుగా పొరుగు జిల్లాలకు పంపుతుండడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రెం డు రోజుల నుంచి సోషల్‌ మీడియా ద్వారా వందలాది మంది టీచర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉపాధ్యా య సంఘాల తీరును ఎండగడుతున్నారు. కేవలం ఉ ద్యోగ సీనియార్టీని లెక్కలోకి తీసుకొని ఏకంగా పొరు గు జిల్లాలకు పంపుతూ స్థానికేతరులుగా ముద్రవే యడం సమంజసం కాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుంద ని ఊహించలేమని చెబుతున్నారు. ఇకనైనా యూ నియన్‌ నాయకులు ఆధిపత్య ధోరణిని పక్కన పె ట్టి ఏకతాటిపైకి వచ్చి సీఎం కేసీఆర్‌తో ఉపాధ్యాయుల ఆందోళనను వివరించి భవిష్యత్‌లోనైనా తిరిగి సొంత జిల్లాలకు రప్పించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. 

అధికారుల తీరుపైనా సందేహాలు.. 

జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు అక్కడి సిబ్బంది నిర్వహకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో సీనియార్టీ జాబితా ప్రక్రియ జరిగినప్పటికీ మళ్లీ ఆ జాబితాలో తప్పిదాలు ఎలా తలె త్తాయన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సవరణల పేరిట అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభు త్వం నిర్ధేశించిన గడువులో ప్రక్రియను పూర్తి చేయాలన్న తాపత్రయంతోనే అ ధికారులు జాబితా విషయంలో పట్టించుకోలేదని, దీనిని ఆసరాగా చేసుకున్న సిబ్బం ది, యూనియన్‌ నేతలు చేతివా టం ప్రదర్శించి అనుకూలమై న వారి కోసం తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తుల వెల్లువ.. 

స్థానికేతరులుగా తమను పొ రుగు జిల్లాలకు బలవంతంగా పంపుతుండడాన్ని టీచర్లు వ్యతిరే కిస్తున్నారు. వీరికి యూనియన్‌ల నుంచి మద్దతు లభించకపోతుండడంతో వారంతా తమ గోడును సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చే యాలని సీఎం కేసీఆర్‌, సుప్రీంకోర్టుకు, గవర్నర్‌కు, రాష్ట్రపతికి సై తం అభ్యర్థిస్తున్నారు.

Updated Date - 2021-12-27T04:41:05+05:30 IST