భక్తిశ్రద్ధలతో మొహర్రం ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-08-20T06:10:23+05:30 IST

తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పండుగల్లో మతసామరస్యాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం పండుగ ఉత్స వాలు మండలంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే మొహర్రం పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం ఉత్సవాలు

తలమడుగు, ఆగస్టు 19: తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పండుగల్లో మతసామరస్యాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం పండుగ ఉత్స వాలు మండలంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే మొహర్రం పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లాకే ఆదర్శంగా ఉన్న రుయ్యాడి హస్సేన్‌ హుస్సేన్‌ను గురువారం జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌రాథోడ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ ఎంపీ నగేష్‌, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ మతసామరస్యాలకుఅతీతంగా మోహర్రం ఉత్సవాలను రుయ్యాడిలో ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. రుయ్యాడి సవార్లకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. నమ్ముకున్న వారికి నమ్ముకునంతగా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం మలిదలను పురస్కరించుకుని హస్సేన్‌ హుస్సేన్‌ ఆలయంలో ఉదయం నుంచి తయారు చేసిన మలిద లడ్డూలు, ఇతర ప్రత్యేక వంటకాలను తీసుకొచ్చి హస్సేన్‌ హుస్సేన్‌కు సమర్పించుకున్నారు. రుయ్యాడి పీరీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచేకాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అదే విధంగా మండలంలోని తలమడుగు, బరంపూర్‌, కుచ్లాపూర్‌, సుంకిడి, కజ్జర్ల తదతర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. 

మావల: మతసామరస్యానికి మొహర్రం పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని దిమ్మా గ్రామంలో హస్సేన్‌ హుస్సేన్‌ సవారి బంగ్లాను ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. అనంతరం పీరీలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ పండుగలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు చైర్మన్‌ అడి ్డభోజారెడ్డి, సర్పంచ్‌ గంగమ్మ, ఎంపీటీసీ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొండ లక్ష్మణ్‌రెడ్డి, అల్లూరి రమేష్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

భీంపూర్‌: మండలంలోని పిప్పల్‌కోటిలో గురువారం పీరీలకు భక్తిశ్రద్ధలతో మలిదాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలను నడుమ మొక్కు గందలు చెల్లించుకున్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో మొహర్రం కన్నుల పండువగా నిర్వహించుకున్నారు.

Updated Date - 2021-08-20T06:10:23+05:30 IST