యువత లక్ష్యం కోసం శ్రమించాలి

ABN , First Publish Date - 2021-02-27T04:01:51+05:30 IST

టీఆర్టీ, టెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న యువత తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమించాలని ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ అన్నారు.

యువత లక్ష్యం కోసం శ్రమించాలి
కౌటాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌

- ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌
కౌటాల, ఫిబ్రవరి 26: టీఆర్టీ, టెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న యువత తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమించాలని ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ అన్నారు. కౌటాల మండల కేంద్రంలో కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టీఆర్టీ, టెట్‌ కోచింగ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే కోనప్పతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే కోచింగ్‌ సిర్పూర్‌ నియోజక వర్గంలో నిర్వహించడం ఎమ్మెల్యే కోనేరు కోనప్పకే సాధ్యమన్నారు. ఇలాంటి కోచింగ్‌లు నిర్వహించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. దాంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, సర్పంచ్‌ మౌనీష్‌, ఎంపీటీసీలు మనీష్‌, నాయకులు తిరుపతి, రవీందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, సంతోష్‌, రాంచందర్‌, రమేష్‌, తిరుపతి, బాపు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-02-27T04:01:51+05:30 IST