ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-09T05:18:49+05:30 IST

ఈ నెల 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పార దర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయ ల్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు అమలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శానిటైజ ర్లు ఉపయోగించాలని, హెల్త్‌ వర్కర్లను నియమించాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 8: ఈ నెల 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పార దర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయ ల్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు అమలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శానిటైజ ర్లు ఉపయోగించాలని, హెల్త్‌ వర్కర్లను నియమించాలని అన్నారు. పోలింగ్‌ కేం ద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. వెబ్‌కాస్టింగ్‌ అన్ని కేంద్రా ల్లో నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్‌ బందోబస్తు ఏర్పా టు చేయాలని అన్నారు. పోలింగ్‌ సామగ్రితో కేంద్రాలకు వెళ్లేటప్పుడు పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌తో రిసెప్షన్‌ కేంద్రాలకు చేరే వరకు బందోబస్తు ఉం డాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డులు లేదా ఎన్నికల కమిషన్‌ సూచించిన 11 గు ర్తింపులలో ఏదైనా ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు ఓటర్లను కేంద్రంలోకి అ నుమతించాలని సూచించారు. పోలింగ్‌ అధికారులు సమకూర్చే వైలెట్‌ పెన్నుతో నే బ్యాలెట్‌ పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు తెలియజే యాలన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని, ఏఎ న్‌ఎంలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈనెల 14న జరిగే ఓట్ల లెక్కిం పు ప్రక్రియను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్‌ కేంద్రం పరిశీలించిన కలెక్టర్‌..
వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేం ద్రాన్ని పరిశీలించారు. కేంద్రం ప్రధాన ద్వారం వద్ద టెంట్‌ ఏర్పాటు చేయాలని, మొబైల్‌ ఫోన్లను గేట్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. అవసరమైతే వీల్‌ చైర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేయాలి
భైంసా:  భైంసాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చే యాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. బుధవారం ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి భైంసాలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి వి స్మరించరాదన్నారు. ఽథర్మల్‌ సెన్సార్‌తో పరీక్షలు చేసి పీపీ కిట్లు అందించాలన్నారు. హెల్త్‌వర్కర్లను, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ని ర్వహించాలని, పోలీస్‌ బందోబస్తు మధ్య ఎన్నికలు జరపాలన్నారు. ప్రభుత్వం గు ర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదీ ఉన్నా ఓటు వేసేందుకు అనుమతిం చాలని తెలిపారు. ఓటింగ్‌పై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. భైంసా పరిధిలో 102 మంది ఓటర్లుండగా 59 మంది మహిళలు, 43 మంది పు రుషులున్నారన్నారు. కేంద్రాలు శుభ్రం చేయించాలని, లైటింగ్‌ ఏర్పాట్లు తదితర వాటిపై సూచనలు చేశారు. అదనపు ఎస్పీ కిరణ్‌ కారే, ఆర్డీవో విశ్వంబర్‌, ఎంపీ డీవో గంగాధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:18:49+05:30 IST