ఎంఎల్‌సీ ఉదారత.. వృద్ధ దంపతులకు ఇల్లు నిర్మాణం
ABN , First Publish Date - 2021-07-25T04:12:41+05:30 IST
మండల కేంద్రంలోని రాగం మల్లయ్య-పోసక్క నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్ ఇల్లు నిర్మిం చి ఇచ్చారు. వీరి ఇల్లు శిథిలం కావడంతో ఎంఎల్‌సీ గమనించారు. మూడు నెల ల క్రితం ఇల్లును తొలగింపజేసి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.

కోటపల్లి, జూలై 24 : మండల కేంద్రంలోని రాగం మల్లయ్య-పోసక్క నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్ ఇల్లు నిర్మిం చి ఇచ్చారు. వీరి ఇల్లు శిథిలం కావడంతో ఎంఎల్‌సీ గమనించారు. మూడు నెల ల క్రితం ఇల్లును తొలగింపజేసి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ. 5 లక్షల సొంత నిధులతో నిర్మాణం పూర్తి చేసి శనివారం మంత్రి కేటీఆర్ జన్మది నం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఇల్లు అందించారు. గ్రామస్తులు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య దంపతులతో గృహ ప్రవేశం చేయించారు. ఎంఎల్‌సీ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఇల్లు నిర్మించి అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కోటపల్లి, చెన్నూరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.