పీఏసీఎస్‌ డైరెక్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-01T04:04:51+05:30 IST

మండలంలోని తలోడి గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ డైరె క్టర్‌ శైలేష్‌ ఇటీవల అనారోగ్యంతో తలకు ఆపరేషన్‌ చేయించుకోగా శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పీఏసీఎస్‌ డైరెక్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కోనప్పకు వినతిపత్రం అందజేస్తున్న నిరుద్యోగులు, టీఆర్టీ అభ్యర్థులు

కౌటాల, డిసెంబరు 31: మండలంలోని తలోడి గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ డైరె క్టర్‌ శైలేష్‌ ఇటీవల అనారోగ్యంతో తలకు ఆపరేషన్‌ చేయించుకోగా శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీవిశ్వనాథ్‌, సర్పంచ్‌ మౌనీష్‌, ఉపసర్పంచ్‌ తిరుపతి, ఎంపీటీసీ మనీష్‌, నాయకులు అజ్మత్‌ అలీ రవీందర్‌గౌడ్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, బాపు, అశోక్‌ తదిత రులు పాల్గొన్నారు. 

జిల్లా వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌: జిల్లా వాసులకే స్థానిక ఉద్యోగాలు దక్కేలా చూడాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు శుక్రవారం నిరుద్యోగులు, టీఆర్టీ అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారు నిత్యాన్నదాన సత్రంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 317 జీవోను సవరించి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చేల చూడాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-01-01T04:04:51+05:30 IST