వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన

ABN , First Publish Date - 2021-06-23T05:02:26+05:30 IST

నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2, 14, 15 వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పర్యటించారు

వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన
సంఘమల్లయ్య పల్లె 15వ వార్డులో స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

- సమస్యలను విన్నవించిన స్థానికులు
నస్పూర్‌, జూన్‌ 22: నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2, 14, 15 వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పర్యటించారు. సీసీసీలోని ప్రశాంత్‌నగర్‌, సంఘమల్లయ్య పల్లె, గాంధీనగర్‌ ఏరి యాల్లోని బస్తీలను పాదయాత్ర చేశారు. దారి పొడవునా పలు చోట్ల మహిళలను ఎమ్మెల్యే పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. సంఘమల్లయ్య పల్లెలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉన్నదని, మురుగు కాలువలు శుభ్రం చేయడంలేదని స్థానికులు ఎమ్మెల్యేకు చెప్పారు. మంచినీటి ట్యాంకు వద్ద అపరిశుభ్రంగా ఉన్నందున వెంటనే శుభ్రం చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గాంధీనగర్‌ ఏరియాలో మిషన్‌ భగిరథ పైపులైన్‌ ద్వారా పలుకుబడి కలిగిన వారికి ఒక్కొక్కరికి రెండు నల్లా కనెక్షన్లు ఇచ్చారని పలువురు తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా వస్తున్న నీరు సరిపోవడం లేదని ప్రస్తావించారు. మురుగు కాలువల పూడికను తీసే వారు కరువయ్యారని తెలిపారు. దీంతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి పారిశుధ్య సమస్య తలెత్తుతోందని తెలిపారు. సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు బొయ మల్లయ్య, అన్నపూర్ణ, వంగ తిరుపతి, నాసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తుంగపిండి రాయలింగు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ సాయి కిరణ్‌, ఆర్‌ఐ వెంకటేష్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, కోటిలింగం, హైమద్‌, ఎర్రయ్య ఉన్నారు.

Updated Date - 2021-06-23T05:02:26+05:30 IST