కళాకారులకు అండగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

ABN , First Publish Date - 2021-06-24T05:30:00+05:30 IST

కరోనా మహ మ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో పాటు నిబంధనలు ఉండడంతో కొంతకాలంగా ఎలాంటి ఆర్డర్లులేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన ఎందరో కళాకారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా నిలి చారు.

కళాకారులకు అండగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కళాకారులకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న రాజబాబు

బోయిన్‌పల్లి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా మహ మ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో పాటు నిబంధనలు ఉండడంతో కొంతకాలంగా ఎలాంటి ఆర్డర్లులేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన ఎందరో కళాకారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా నిలి చారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కళాకారుల ఇబ్బందులను కాగజ్‌నగర్‌కు చెందిన హరికాంత్‌ అనే ఆర్టిస్టు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకెళ్లాడు. తమకు ఏదైనా సహాయం అందించాలని కోరాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోనప్ప దాదాపు మూడువేలరూపాయల విలువచేసే 50కిలోల బియ్యం బ్యాగ్‌లతోపాటు నిత్యావసర సరు కులు, కూరగాయలను తక్షణ సహాయంగా అర్కెస్ర్టా సౌండ్‌ సింగర్స్‌ మ్యూజీషియన్లతోపాటు డ్యాన్సర్లు వందమందికి అందజేశారు. గురువారం హైదరాబాద్‌ బోయిన్‌పల్లి చందనా గార్డెన్‌లో ఎమ్మెల్యే కోనప్ప కుటుంబసభ్యుడు కోనేరు రాజాబాబు ఆధ్వర్యంలో వీటిని కళాకారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా అడిగిన వెంటనే కళాకారులకు రెండు నెలలకు సరిపడా సరుకులను అందజేసి ఆదుకున్న ఎమ్మెల్యే కోనప్ప, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్కెస్ర్టా కళాకారుడు హరికాంత్‌ కృత జ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కోనప్ప ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సురేష్‌ చౌదరి, సతీష్‌, మమత, ఎమ్మెల్యే పీఏ దినేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:30:00+05:30 IST