పిప్రి ఎత్తిపోతల మ్యాప్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-04-08T05:28:14+05:30 IST
లోకేశ్వరం మండలంలోని గోదావరిబ్యాక్ వాటర్‌పై నూ తనంగా నిర్మించనున్న పిప్రి గ్రామ ఎత్తిపోతల పథకంమ్యాప్‌ను బుధవారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలించారు.
ముథోల్, ఏప్రిల్ 7 : లోకేశ్వరం మండలంలోని గోదావరిబ్యాక్ వాటర్‌పై నూ తనంగా నిర్మించనున్న పిప్రి గ్రామ ఎత్తిపోతల పథకంమ్యాప్‌ను బుధవారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలించారు. ముథోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐడీసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. పిప్రి ఎత్తి పోతల పథకంకు తెలంగాణ ప్రభుత్వం 58.95 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో ఐడీసీ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేకసమావేశం నిర్వహించి పలువివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐడీసీ డీఈఈ హంజనాయక్, ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.
సంఘటితం కోసమే రైతువేదికలు
తానూర్ , ఏప్రిల్ 7 : రైతు సంఘటితం కోసం రైతువేదికలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. బుధవారం తానూర్ మండ లంలోని జవుల(బి) గ్రామంలో రైతువేదిక నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి.మంజుల, సోసైటీ చైర్మన్ నారాయణ్‌పటేల్, ఆత్మచైర్మన్ పోతా రెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, వ్యవసాయ ఏడి అంజిప్రసాద్, డీఈ కమలకర్, ఎంపీవో మోహన్ సింగ్, ఏవో గణేష్, స్థానిక సర్పంచ్ సతప్ప పటేల్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు తాడేవార్ విఠల్, ఎంపీటీసీ బసవేశ్వర్‌పటేల్, నాయకు లు బి.చంద్రకాంత్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, శివ పటేల్, గజనంద్, బషీర్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ విస్తరణ అధికారుల, రైతు లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
కుంటాల, ఏప్రిల్ 7 : కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బుధవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అందజేశారు. కల్లూర్ గ్రామానికి చెందిన బద్దం వేణురెడ్డికి రూ. లక్ష, రాజన్న రూ. 59వేలు, పెంట ముత్తన్నకు రూ. 19వేలు, బద్దం సాగర్‌రెడ్డికి రూ. 17500, జమాల్‌సాబ్‌లకు రూ. 7500 సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు.