మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-06T05:22:28+05:30 IST

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన
పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే



జైనథ్‌, ఫిబ్రవరి 5: మండలంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా అందించే పనులపై ఎమ్మెల్యే జోగు రామన్న అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని గిమ్మా గ్రామంలో అధికారులు, నాయకు లతో కలిసి గ్రామంలో చేపడుతున్న మిషన్‌ భగీరథ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రతి ఇంటికీ శుద్ధజలం అందుతుందన్నారు. 90శాతం వ్యాధులు తాగునీటి ద్వారానే వస్తున్నాయని ఇందుకు బాధ్యతయుతంగా పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, జడ్పీటీసీ తుమ్మల అరుందతి, ఎంపీటీసీ కోల భోజన్న, మిషన్‌ భగీరథ పథకం జిల్లా ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఏఈ చంద్రశేఖర్‌, ఎంపీడీవో గజానన్‌రావ్‌, సర్పంచ్‌ సుమ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:22:28+05:30 IST