కనువిందు చేస్తున్న వలస పక్షులు
ABN , First Publish Date - 2021-12-10T03:51:50+05:30 IST
పెంచికలపేట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దట్టమైన అటవీ ప్రాంతం, పొడుగు ముక్కు రాబంధులు, పెద్దపులులు.

పెంచికలపేట, డిసెంబరు 9: పెంచికలపేట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దట్టమైన అటవీ ప్రాంతం, పొడుగు ముక్కు రాబంధులు, పెద్దపులులు. అయితే మాకేం తక్కువ అన్నట్లు శ్రీలంక, స్వీడన్, నైజీరియా దేశాలు, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితరరాష్ట్రాల నుంచి శీతాకాలంలో ఈప్రాంతానికి వలసపక్షులు విడిదికి వచ్చాయి. దీంతో అడవి కొత్త శోభ సంతరించుకోగా పక్షులు తమ శబ్ధాలతో సందడి చేస్తు న్నాయి. వివిధ రకాల కొత్త పక్షులు ఈ ప్రాంతంలో కని పించడంతో పర్యా వరణ, పక్షి ప్రేమి కులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.