బోథ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి రచ్చ!
ABN , First Publish Date - 2021-05-09T04:08:14+05:30 IST
మండలకేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ర చ్చ జరిగింది. పీపీఈ కిట్ల విషయంలో సూపరింటెండెంట్‌తో ఎంపీపీ తీవ్ర వా గ్వాదం జరుపగా, రాత్రివేళ పుల్లుగా తాగి ఆస్పత్రికి రావడం ఏమిటని వైద్య సి బ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... శుక్రవారం రాత్రి నాలుగు పీపీఈ కిట్లు కావాలని ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఎంపీఈవో జీవన్‌రెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను అడిగారు. అయితే కిట్లు ఇవ్వడం కష్టమని సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రప్రసాద్ తేల్చిచెప్పారు.

పీపీఈ కిట్లు ఇవ్వాలని సూపరింటెండెంట్‌తో బోథ్ ఎంపీపీ తీవ్ర వాగ్వాదం
తాగిన మైకంలో ఆస్పత్రికి రావడం ఏమిటని వైద్య సిబ్బంది ఆగ్రహం
పోలీసుస్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు
బోథ్ ఎంపీపీతో పాటు మరో ఇద్దరి కేసు
తుల శ్రీనివాస్ తీరుపై టీఆర్ఎస్లో కలకలం
బోథ్, మే8: మండలకేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ర చ్చ జరిగింది. పీపీఈ కిట్ల విషయంలో సూపరింటెండెంట్‌తో ఎంపీపీ తీవ్ర వా గ్వాదం జరుపగా, రాత్రివేళ పుల్లుగా తాగి ఆస్పత్రికి రావడం ఏమిటని వైద్య సి బ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... శుక్రవారం రాత్రి నాలుగు పీపీఈ కిట్లు కావాలని ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఎంపీఈవో జీవన్‌రెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను అడిగారు. అయితే కిట్లు ఇవ్వడం కష్టమని సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రప్రసాద్ తేల్చిచెప్పారు. దీంతో ఎంపీపీ, సర్పంచ్, డాక్టర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఆసుపత్రిలో పీపీఈ స్టాక్ రిజిస్టర్ చూపించాలని ఎంపీపీ, సర్పంచ్‌తో పాటు ఎం పీవో వైద్య సిబ్బందిని కోరగా, ఆ అధికారం మీకు లేదని సూపరింటెండెంట్ పేర్కొనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు అ క్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. తిరిగి శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు ఎంపీపీ తు ల శ్రీనివాస్ తీరుపై టీఆర్ఎస్ జిల్లా నేతల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. రాత్రివేళ ఇష్టారీతిగా ఆస్పత్రికి వెళ్లడం సరైన పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు.
తప్పతాగి విధులకు ఆటంకం కల్గించారు: సూపరింటెండెంట్
బోథ్ ఆసుపత్రిలోకి మద్యం తాగి శుక్రవారం అర్ధరాత్రి ఎంపీపీ, ఎంపీవో, స ర్పంచ్‌లు వచ్చి దుర్భాషలాడి తమ విధులకు ఆటంకం కలిగించారని సూపరింటెండెంట్ రవీంద్రప్రసాద్ తెలిపారు. తుల శ్రీనివాస్ ప్రవర్తన పట్ల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి భవిష్యత్‌లో విధుల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రవర్తించిన తీరుతో వైద్యసిబ్బందిలో భయాందోళనలు అలుముకున్నాయన్నారు. ఆసుపత్రిని తనిఖీ చేసే అధికారం ఎంపీపీ, సర్పంచ్‌లకు ఉండదని పేర్కొన్నారు. బోథ్ ఆసుపత్రిలో నిజాయితీగా ఉండి విధులు నిర్వహిస్తున్న తమపై అజమాయిషి చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.
అమర్యాదగా మాట్లాడిన డాక్టర్ : ఎంపీపీ, సర్పంచ్‌లు
బోథ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రప్రసాద్ ప్రజాప్రతినిధుల మైన తమను చులకనగా మాట్లాడారని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సురేందర్‌యాదవ్ విమర్శించారు. తమకు ఎలాంటి అధికారం లేదనడం సరైంది కాదన్నారు. ఆసుపత్రి వైద్యుడిగా ఉంటూ ప్రభుత్వ వైద్యానికన్నా ప్రైవేట్ వైద్యానికి అదికూడా తన ఆసుపత్రిలో చేరిన వారికే వైద్యం చేస్తున్నారన్నారు. తాము మద్యం తాగి ఆసుపత్రికి వెళ్లామని ఆరోపించడం నిజం కాదని, రాత్రి పరీక్షలు చేస్తే వాస్తవాలు తేలేవన్నారు.
ఇరువర్గాల పరస్పర ఫిర్యాదు..
బోథ్ ఆసుపత్రిలో జరిగిన గొడవలో స్థానిక ఎంపీపీ సర్పంచ్‌లు డాక్టర్‌పై శనివారం బోథ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎస్సై రాజు తెలిపారు. వీరికం టే ముందుగా సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రప్రసాద్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇతని ఫిర్యాదుతో సెక్షన్ 353, 294బి, 186, 188, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
చర్చనీయాంశంగా మారిన ఇరువర్గాల కేసులు...
బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్రప్రసాద్ మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు టీఆర్ఎస్ నాయకులు సైతం రెండుగ్రూపులుగా విడిపోయారు. విలేకరుల సమావేశంలో వారి వారి అనుచరులతో కనిపించారు. జిల్లాలో మొత్తం మీద ఇరువర్గాల మధ్య గొడవ టీఆర్ఎస్ జిల్లా నేతల్లో కలకలం రేపింది.