క్రీడలతో మానసిక ఉల్లాసం
ABN , First Publish Date - 2021-02-02T04:24:34+05:30 IST
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కన్నెపల్లిలో గడికోప్పుల శంకరయ్య స్మారకార్ధం సర్పంచ్ గడికోప్పుల రజిని-సురేందర్ ఆఽధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

దండేపల్లి, ఫిబ్రవరి 1: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కన్నెపల్లిలో గడికోప్పుల శంకరయ్య స్మారకార్ధం సర్పంచ్ గడికోప్పుల రజిని-సురేందర్ ఆఽధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీ నర్ గురువయ్య, లింగన్న, వెంకటేష్, అనిల్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం
లక్షెట్టిపేట: పేద కుటుంబాలను ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో 16 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీపీ అన్నం మంగ, మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య, వైస్‌చైర్మన్ శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.