ఉరేసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-25T06:12:36+05:30 IST

పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన జిల్లాకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మావలలోని షాద్‌నగర్‌కు చెందిన రహిమాన్‌ జాహిమ్‌(19) నిజామాబాద్‌లోని తిరుమల డెంటల్‌ కాలేజీలో బీడీఎస్‌ డెంటల్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షలు సరిగ్గా రాయలే దని ఇంట్లో తరచూ

ఉరేసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య

పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతోనే.. 

మావల, డిసెంబరు 24: పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన జిల్లాకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మావలలోని షాద్‌నగర్‌కు చెందిన రహిమాన్‌ జాహిమ్‌(19) నిజామాబాద్‌లోని తిరుమల డెంటల్‌ కాలేజీలో బీడీఎస్‌ డెంటల్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షలు సరిగ్గా రాయలే దని ఇంట్లో తరచూ చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రహిమాన్‌ జాహిమ్‌.. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-12-25T06:12:36+05:30 IST