చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2021-05-19T03:51:42+05:30 IST

మంచిర్యాల జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం మంచిర్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. మంత్రులు కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు విషయమై ప్రస్తావించారు. అయితే సంవత్సరాలు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

చిగురిస్తున్న ఆశలు
జిల్లా కేంధ్రంలోని భూధాన్‌ భూముల్లో వైద్య కళాశాలకు ప్రపోజ్‌ చేసిన భూములు

మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై సీఎం ప్రకటన

ఈసారైనా కల నెరవేరేనా

స్థల పరిశీలన జరిపినా ముందుకు సాగని ప్రక్రియ

మంచిర్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం మంచిర్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది.  మంత్రులు కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు విషయమై ప్రస్తావించారు. అయితే సంవత్సరాలు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కేసీఆర్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రజలు కరీంనగర్‌, వరంగల్‌, హైద్రాబాద్‌ వెళుతూ అధిక వ్యయప్రయా సాలకు గురవుతున్నారు. జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటైతే నాణ్యమైన వైద్యం స్థానికంగానే దొరుకు తుందనే ప్రజలు ఆశిస్తున్నారు.

సీఎం ప్రకటనతో చిగురుస్తున్న ఆశలు...

జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈనెల 17న ప్రకటించారు. కొవిడ్‌-19పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావే శం సందర్భంగా మంచిర్యాలతో సహా ఆరు జిల్లాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఆదే శించారు. వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్య మంత్రి సూచించారు. దీంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్ప డిన నాటి నుంచి ఇక్కడ 250 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రి స్థాయిని 100 నుంచి 250 పడకలకు పెం చుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతికుమారి 2018 ఫిబ్రవరి 15న జీవో జారీ చేశారు. ఇందులో భాగంగా రూ.34.15 కోట్ల అంచనాతో భవనం నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో నాన్‌ రికరింగ్‌ ఖర్చులో భాగంగా భవన నిర్మాణం సివిల్‌ పనులకు రూ.25.50 కోట్లు, పరికరాలకు రూ. 1.50 కోట్లు కేటాయించారు. అలాగే రికరింగ్‌ ఖర్చుల కింద మరో రూ.7.15 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసినప్పటికీ సంబంధిత ఫైలు ముందుకు కదలలేదు. 

భూ సేకరణ జరిపినా....

ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌ జీవో విడుదల కావడంతో అప్పటి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ భూ సేకరణ జరిపారు. జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో గల 27 ఎకరాల భూదాన్‌ భూములను ఆసుపత్రుల సముదాయానికి కేటాయిస్తూ ప్రొసీడింగ్‌ ఇచ్చారు. సదరు భూముల్లో జిల్లా ఆస్పత్రితోపాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం, భవిష్యత్‌లో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి అవసరమ య్యే విధంగా భూ సేకరణ చేపట్టారు. ప్రస్తుతం భూదాన్‌ భూముల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులు చురుగ్గా కొనసాగు తున్నాయి. జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి జీవో విడుదలై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో భూదాన్‌ భూములు ఉపయోగపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నెరవేరని ముఖ్యమంత్రి హామీ....

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. 2018 నవంబర్‌ 29న జిల్లాలోని మంచి ర్యాల, మందమర్రి, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో  ఏర్పా టు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రెండు నెలల్లో మంచిర్యాలలో 500 పడకలతో కూడిన మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని  ప్రక టించారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచినా వైద్య కళాశాల ఏర్పాటు ప్రస్తావన రాకపోవడంతో ఆ అంశం మరుగున పడినట్లయింది. కేసీఆర్‌ మళ్లీ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

సీఎం ప్రకటన హర్షణీయం

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

జిల్లాకు మెడికల్‌ కాలేజీతోపాటు అనుబంధ నర్సిం గ్‌ కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెల పడం హర్షణీయం. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని అనేకమార్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తా వించడం జరిగింది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మంచిర్యాల చుట్టుపక్కల నియోజక వర్గాలైన బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం మంచిర్యాలకు వస్తున్నారు. మంచిర్యాలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో అరకొర వసతులతో ఇబ్బందికర పరిస్థితి ఉంది. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో  ప్రజల కు ఆధునిక వైద్యం అందనుంది. మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు.


Updated Date - 2021-05-19T03:51:42+05:30 IST