గ్రామాల్లో వైద్యశిబిరాలు

ABN , First Publish Date - 2021-09-03T04:47:20+05:30 IST

మండలంలోని సోమిని గ్రామంలో గురువారం ప్రజాబంధు ఫౌండేష్‌, ప్రజాలైఫ్‌ కేర్‌హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరల్‌జ్వరాలు, డెంగ్యూ తదితరా లతో బాధపడుతున్న వారికి డాక్టర్లు సాయివి వేక్‌, చైతన్య, పాల్వాయి హరీష్‌బాబు పరీక్షలు నిర్వహించారు.

గ్రామాల్లో  వైద్యశిబిరాలు
సోమినిలో శిబిరానికి వచ్చిన రోగులు

బెజ్జూరు, సెప్టెంబరు 2: మండలంలోని సోమిని గ్రామంలో గురువారం ప్రజాబంధు ఫౌండేష్‌, ప్రజాలైఫ్‌ కేర్‌హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరల్‌జ్వరాలు, డెంగ్యూ తదితరా లతో బాధపడుతున్న వారికి డాక్టర్లు సాయివి వేక్‌, చైతన్య, పాల్వాయి హరీష్‌బాబు పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 436మంది పరీ క్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సోయం చిన్నయ్య, ఉపసర్పంచ్‌ తిరుపతి, సంతోష్‌, కేశవ్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

 చింతలమానేపల్లి: మండలంలోని దిందా గ్రామంలో కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు కొత్తపల్లిశ్రీనివాస్‌, కిమ్స్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ బాలకృష్ణ 200మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, రుషి, అంకులు, రామన్న, శ్రీనివాస్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

జైనూరు: గ్రామాల్లో వ్యాధులు ప్రభల కుండా గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండా లని ఎంపీపీ తిరుమల అన్నారు. మండలం లోని జెండాగూడ, లెండిజాల గ్రామాల్లో గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు మందులు పంపిణీ చేశారు. హెల్త్‌సూపర్‌వైజర్‌ కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T04:47:20+05:30 IST