మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-13T04:06:04+05:30 IST

ప్రతీ ఒక్కరు మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని శిశుమందిర్‌ పాఠశాలలో డీసీపీ, ఏసీపీ అఖిల్‌ మహాజన్‌లు, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజులు మొక్కలు నాటారు.

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
మంచిర్యాల శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న ట్రాఫిక్‌ పోలీసులు

ఏసీసీ, జూలై 12: ప్రతీ ఒక్కరు మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని శిశుమందిర్‌ పాఠశాలలో డీసీపీ, ఏసీపీ అఖిల్‌ మహాజన్‌లు, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజులు మొక్కలు నాటారు.  డీసీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడవ విడత హరితహారంలో పోలీసు శాఖ తరపున జిల్లాలో లక్ష మొక్కలు నాటుతామన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను  తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో    ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాజు, ఏఎస్సై విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

 భీమారం: హరితహారంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి హరిత  తెలంగాణ కోసం కృషి చేయాలని డీసీపీ ఉద య్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌ ఆవ రణలో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. డీసీపీ మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మను గడ ఆధారపడి ఉందన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో, గ్రామాల్లో ఇప్పటి వరకు 40 వేల వరకు మొక్కలు నాటామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎస్‌ఐ అశోక్‌, సీఐ సంజీవ్‌, ఎఎస్‌ఐ భూమన్న పాల్గొన్నారు. 

జైపూర్‌ : పోలీసులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కృషి చేయాలని  డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి  రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌  కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొని మొక్కలు  నాటారు. ఏసీపీ నరేందర్‌, శ్రీరాంపూర్‌ సీఐ సంజీవ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

  

Updated Date - 2021-07-13T04:06:04+05:30 IST