అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-02-27T03:39:05+05:30 IST
అక్రమంగా ఇసుక నిల్వచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతి హొళికేరిలు పేర్కొన్నారు. శుక్రవారం ముల్కల్ల శివారు గోదావరి నది వద్ద గనులు, భూగర్భ శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యేడాది కాలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండటంతో ఇసుక రవాణాకు ఆటంకం ఏర్ప డిందని, దీంతో ప్రభుత్వ పరంగా, ఇతర ప్రైవేటు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు.

హాజీపూర్, ఫిబ్రవరి 26 : అక్రమంగా ఇసుక నిల్వచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతి హొళికేరిలు పేర్కొన్నారు. శుక్రవారం ముల్కల్ల శివారు గోదావరి నది వద్ద గనులు, భూగర్భ శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యేడాది కాలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండటంతో ఇసుక రవాణాకు ఆటంకం ఏర్ప డిందని, దీంతో ప్రభుత్వ పరంగా, ఇతర ప్రైవేటు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. గోదావరి నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో దళారుల ప్రమేయం లేకుండా ఇసుక పాలసీకి అనుగుణంగా ఇసుక రీచ్‌లను ప్రారంభిం చడం జరిగిందన్నారు. మైనింగ్ శాఖ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తుండగా ట్రాక్టర్ యజమానులతో పాటు ఇంటి నిర్మాణాలు చేపట్టే యజమానులకు మేలు జరుగుతుం దన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆన్‌లైన్ ఇసుక ధరల రేట్లను పెంచాలని ట్రాక్టర్ యజమానుల అసోసి యేషన్ కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ముల్కల్ల సర్పంచ్ శ్రీనివాస్, మొగిలి శ్రీనివాస్, మైనింగ్ ఏడీ బాలు, ఆర్‌ఐ హర్షన్‌కుమార్, సర్వేయర్ మధుకర్, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.