పలు గ్రామాల్లో బీజేపీలో భారీగా చేరికలు
ABN , First Publish Date - 2021-01-12T05:34:16+05:30 IST
నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ జిల్లా నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో సోన్ మండలంలోని బొప్పారం గ్రామం, నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు.

నిర్మల్ టౌన్, జనవరి 11: నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ జిల్లా నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో సోన్ మండలంలోని బొప్పారం గ్రామం, నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, ఒడిసెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, మేడిసెమ్మె రాజు, జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు రాచకొండ సాగర్, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్, మండల అధ్యక్షుడు అనీల్, పట్టణ అధ్యక్షుడు సాధం అరవింద్, నిర్మల్ పటట్ణ కౌన్సిలర్స్, కత్తి నరేందర్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్ పి.గణేష్, జిల్లా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.