అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-01-18T04:33:42+05:30 IST

మండలంలోని గొడ్సారా గ్రామానికి చెందిన నజిమా బేగం(24) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ప్ర భాకర్‌రెడ్డి తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

కుభీర్‌, జనవరి 17 : మండలంలోని గొడ్సారా గ్రామానికి చెందిన నజిమా బేగం(24) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ప్ర భాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు కామారె డ్డి జిల్లా ఏన్భోరా గ్రామానికి చెందిన నజిమా బేగంకు నాలుగేళ్ల క్రితం గొడ్సారా గ్రామానికి చెందిన అఖిల్‌బేగ్‌తో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం అ త్తారింటి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి అన్న షేక్‌ ఎక్భాల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-01-18T04:33:42+05:30 IST