కేజీబీవీ సిబ్బంది నియామకాల్లో అవకతవకలు?

ABN , First Publish Date - 2021-11-28T04:16:22+05:30 IST

మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశా లలో బోధనా సిబ్బంది కోసం ఇటీవల దరఖా స్తులు తీసుకున్న విషయం విధితమే. అయితే శనివారం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో కొంతమంది సెలక్ట్‌ అయిన వారికి అధికారులు ఫోన్‌లో సమాచారం అందించారు.

కేజీబీవీ సిబ్బంది నియామకాల్లో అవకతవకలు?
చింతలమానేపల్లి కేజీబీవీ పాఠశాల

-మెరిట్‌లిస్ట్‌ పెట్టకపోవడంపై అనుమానాలు

-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి విమర్శలు 

చింతలమానేపల్లి, నవంబరు 27: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశా లలో బోధనా సిబ్బంది కోసం ఇటీవల దరఖా స్తులు తీసుకున్న విషయం విధితమే. అయితే శనివారం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో కొంతమంది సెలక్ట్‌ అయిన వారికి అధికారులు ఫోన్‌లో సమాచారం అందించారు. ఫోన్‌ చేయని అభ్యర్థుల్లో అయోమయంనెలకొంది. ఈ నియా మకాల్లో అవకత వకలు జరిగాయని ఫోన్‌ రాని మిగతా అభ్యర్థులనుంచి విమర్శలు వినిపిస్తు న్నాయి. పాఠశాలలో మొత్తం11 పోస్టులకు గానూ సీఆర్టీ4, పీజీసీఆర్టీ7 పోస్టులు ఖాళీలు న్నాయి. వీటికి211మంది అభ్యర్థులు వివిధ సబ్జెక్టుల కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే మెరిట్‌ లిస్ట్‌ పెట్టకుండానే అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో మిగతా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 211 మంది అభ్యర్థుల్లో ఎంపికైనవారి జాబితాను నోటీస్‌బోర్డుపైపెడితే ఈఅనుమానం ఉండేదికాదని పేర్కొంటున్నారు. పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీజనందినిని వివరణ కోరగా తాము కేవలందరఖాస్తులు మాత్రమే స్వీకరించి ఉన్నతాధికారులకు పంపించామన్నారు. అభ్య ర్థుల ఎంపిక ఉన్నతాధికారులే చేశారని, తమకు ఏవిషయం తెలియదన్నారు. కేవలం ఎంపికైన అభ్యర్థుల వివరాలుమాత్రమే తమకు ఇచ్చినట్లు తెలిపారు. ఏమైౖనా సందేహాలుంటే అభ్యర్థులు ఉన్నతాధికారులకు విన్నవించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-28T04:16:22+05:30 IST