మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2021-01-20T15:07:28+05:30 IST
జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మంచిర్యాల: జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.90లక్షల డీఎంఎఫ్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఇరువురిపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వెంచర్‌లో చేశారంటూ బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కలెక్టర్, ఎమ్మెల్యేకు నోటీసలు జారీ చేసింది.