బడులపై నజర్‌!

ABN , First Publish Date - 2021-11-27T05:23:38+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను గాడిన పెట్టేందుకు అధికా ర యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. కలెక్ట ర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఈవో రవీందర్‌ రెడ్డి నాలుగైదు రోజుల నుంచి తనిఖీల ప్రక్రియ షురూ చేశారు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లోని బడులను తనిఖీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. దీంతో టీచర్లు, పంచాయతీలు అప్రమ త్తం అవుతున్నాయి.

బడులపై నజర్‌!
జాం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
అధికారుల తనిఖీలు
బోధన, మౌలిక సౌకర్యాలపై ఆరా  
మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించాలంటూ జీపీలకు ఆదేశాలు


నిర్మల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను గాడిన పెట్టేందుకు అధికా ర యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. కలెక్ట ర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఈవో రవీందర్‌ రెడ్డి నాలుగైదు రోజుల నుంచి తనిఖీల ప్రక్రియ షురూ చేశారు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లోని బడులను తనిఖీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. దీంతో టీచర్లు, పంచాయతీలు అప్రమ త్తం అవుతున్నాయి.
మొదటి నుంచి
విద్య, వైద్య రంగాలపై దృష్టి..
మొదటి నుంచి విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తున్న కలెక్టర్‌కు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ర వీందర్‌ రెడ్డి తోడయ్యారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇద్దరు కలిసి జిల్లాలోని పాఠశాలల పనితీరు, మౌలిక సౌకర్యాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కార్యాచరణ రూ పొందినట్లు తెలుస్తోంది. దీనికి అను గుణంగానే తనిఖీలు చేపట్టి బోధన తీరు, సమస్యలు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్నారు. కొన్ని స మస్య పరిష్కారానికి అక్కడికక్కడే చొరవ తీసుకుంటున్నారు.
స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలపై ఆరా
రెండేళ్ల తర్వాత మొదలైన స్కూ ల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు సంబంధించి కూడా డీఈవో ఆరా తీస్తున్నా రు. గురువారం స్కూల్‌ కాంప్లెక్స్‌ స మావేశాలకు గైర్హాజరైన ఐదుగురు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రతిరోజూ టీచర్ల లైవ్‌ లొకేషన్‌ను పరిశీలిస్తున్నారు.
మారుమూల పల్లెలపై స్పెషల్‌ ఫోకస్‌..
మారుమూల పల్లెల్లోని పాఠశాలలపై కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, డీ ఈవో దృష్టి పెట్టారు. మారుమూల పల్లెల్లోని పాఠశాలలపై కొంతకాలం నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇటు వైపు దృష్టి సారించారు. నాలుగైదు రోజు ల నుంచి ఉన్నతాధికారులంతా వరుస పెట్టి పాఠశాలలను తనిఖీ చేస్తుండడం చర్చనీయాంశమవుతోం ది. ఉన్నతాధికారులు సీరియస్‌గా తనిఖీలతో పాటు అక్కడికక్కడే చర్యలు తీసుకుంటుండడం.. ఉపాధ్యా య వర్గాల్లో కలకలం రేపుతోంది. మొదట ఉన్నతాధికారులంతా కలిసి తనిఖీలు చేయగా ఆ తరువాత అధికారులు వేర్వేరుగా తనిఖీలకు శ్రీకారం చు ట్టారు. తమ తనిఖీల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. సంబంధిత మండల విద్యాధికారుల కు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు సైతం చివరి వరకు తాము ఎక్కడికి వెళుతున్నామన్న సమాచారాన్ని తెలపకుండా వాహనాల్లో అనుసరించాలంటూ సూచిస్తున్న ట్లు సమాచారం.
జీపీ నిధులతో మౌలిక సౌకర్యాల కల్పన..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను క ల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అదనపు గదులు, మ ధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై అక్కడికక్కడే ఆ దేశాలు జారీ చేస్తున్నారు. పం చాయతీ నిధులను ని ర్మాణాల కో సం  ఖ ర్చు చేయాలంటూ ఆదే శిస్తున్నారు. మధ్యా హ్న భోజనానికి సంబంధించి వంట చెరుకును కాకుండా గ్యాస్‌ సిలెండర్‌ను మాత్రమే ఉపయోగించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికోసం కూడా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తున్నారు. పంచాయతీ నిధులను పాఠశాలల అభివృద్ధి కోసం వ్యయం చేయాలంటూ సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ పంచాయతీ కార్యదర్శులకు వార్నిం గ్‌లు ఇస్తున్నారు. విద్యార్థులకు బోధన ఎంత అవసరమో, సౌకర్యాల కల్పన అంతే అవసరమన్న సందేశాన్ని అధికారులకు అందిస్తున్నారు.
గైర్హాజరు టీచర్లకు తాఖీదులు..
కరోనా కారణంగా ప్రతినెలా నిర్వహించాల్సిన స్కూల్‌ కాంప్లెక్స్‌ స మావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల్లో బోధన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు తోడ్పడే ఈ సమావేశాల నిర్వహణపై డీ ఈవో దృష్టి సారిస్తున్నారు. బోధన ప్రమణాలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించి ఈ సమావేశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌లు ప్రారంభమై న మొదటి రోజే డీఈవో వీటిపై నజర్‌ పెట్టారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు గైర్హాజరైన ఐదుగురు టీచర్లకు ఆయన షోకాజ్‌ నోటీసులు జా రీ చేశారు. సమావేశాలను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతీ టీచరు తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-11-27T05:23:38+05:30 IST