10న లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-03-25T05:10:15+05:30 IST

ఏప్రిల్‌ 10న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేలా పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ఉట్నూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అరుణకుమారి అన్నారు.

10న లోక్‌ అదాలత్‌

ఉట్నూర్‌, మార్చి 24: ఏప్రిల్‌ 10న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేలా పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ఉట్నూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అరుణకుమారి అన్నారు. బుధవారం స్థానిక కోర్టులో మండలలీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ హోదాలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు రాజీకుదుర్చుకోని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవేందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జమీర్‌ఖాన్‌, న్యాయవాదులు బాపురెడ్డి, జగన్‌, గిరి, జైవంత్‌తో పాటు సీఐ నరేష్‌కుమార్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, జైనూర్‌ ఎస్సైలు సుబ్బారావు, నాగనాథ్‌, విజయ్‌కుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T05:10:15+05:30 IST