లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-22T03:52:28+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని తహ సీల్దార్‌ హన్మంతరావు, ఎస్సై తాళ్ల శ్రీకాంత్‌ అన్నారు. ముత్యంపేటలో శుక్రవారం 10గంటల తర్వాత తిరుగుతున్న వాహనదారులను తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. తహసీల్దార్‌ పర్యవేక్షించి రోడ్డుపై తిరుగుతున్న వాహనదారులను మందలిచ్చారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
ముత్యంపేటలో వాహనదారుని నుంచి వివరాలు తెలుసుకుంటున్న తహసీల్దార్‌, ఎస్సై,

దండేపల్లి,మే 21: లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని తహ సీల్దార్‌ హన్మంతరావు, ఎస్సై తాళ్ల శ్రీకాంత్‌ అన్నారు. ముత్యంపేటలో శుక్రవారం 10గంటల తర్వాత తిరుగుతున్న వాహనదారులను తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. తహసీల్దార్‌ పర్యవేక్షించి రోడ్డుపై తిరుగుతున్న వాహనదారులను మందలిచ్చారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వాహనలను సీజ్‌చేశారు. 20 మందిపై కేసులు నమోదు చేసి 15 వాహనాలను సీజ్‌ చేశామని ఎస్సై పేర్కొన్నారు. శిక్షణ ఎస్సై శివ, ఏఎస్సై పున్నంచందు, పోలీసు సిబ్బంది ఉన్నారు.  

నస్పూర్‌లో 11 వాహనాల సీజ్‌ 

నస్పూర్‌ : నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 11 వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు  40 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.  10గంటల సమయంలో తెరిచిన 5 షాపులకు, మరో 35 భౌతిక దూరం పాటించక, గుమి గూడిన వారికి చలానా వేశామని తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రక్రియను ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పర్యవేక్షించారు. సీఐ కుమారస్వామి, ఎస్సై శ్రీనివాస్‌, అదనపు ఎస్సై లు హీమామోద్దిన్‌, సంధ్యా, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T03:52:28+05:30 IST