పట్టాలు ఇచ్చిన వారికి భూములు చూపించాలి

ABN , First Publish Date - 2021-08-26T03:58:03+05:30 IST

పట్టాలు మంజూరు చేసిన వారి కి భూములు చూపించాలని, అర్హులైనవారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టాలు కలిగిఉన్న వారితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపి అదనపు కలెక్టర్‌ మధుసూధన్‌నాయక్‌కు వినతి పత్రం అందజేశారు.

పట్టాలు ఇచ్చిన వారికి భూములు చూపించాలి
మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

ఏసీసీ, ఆగస్టు 25: పట్టాలు మంజూరు చేసిన వారి కి భూములు చూపించాలని, అర్హులైనవారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టాలు కలిగిఉన్న వారితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన  తెలిపి అదనపు కలెక్టర్‌ మధుసూధన్‌నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. రఘునాథ్‌ మాట్లాడుతూ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్స రాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క పేదవాడికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, నస్పూర్‌ మండలాల్లో 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు 2 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసిన ప్పటికీ భూమి చూపించలేదని, వెంటనే వారికి భూ ములు చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎమ్మెల్యే అండదండలతో పేదలకు పట్టాలిచ్చి, పంపిణీకి ప్రతిపాదిం చిన భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు భూ ములను  స్వాధీనం చేసుకోవడం లో అలసత్వం ప్రదర్శిస్తున్నార న్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి సర్కారు భూములను స్వాధీనం చేసుకొని, గతంలో పట్టాలు జారీ చేసిన అర్హులకు అందించాలని కోరారు. కార్యక్ర మంలో జిల్లా ప్రధానకార్యదర్శులు శ్రీనివాస్‌, రమేష్‌, ఏమాజి, ఉపాధ్యక్షుడు రజనీష్‌ జైన్‌, అనంద్‌కృష్ణ, వెంకటేశ్వర్‌రావు, అగల్‌డ్యూటీ రాజు, సత్యనారాయణ, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-26T03:58:03+05:30 IST