కొవిడ్ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో రెండు ఆస్పత్రుల ఎంపిక
ABN , First Publish Date - 2021-01-13T04:53:48+05:30 IST
కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా ఈనెల 16న టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను ఎంపిక చేశారు.

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా ఈనెల 16న టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను ఎంపిక చేశారు. జిల్లాలో మొదటి దఫా టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాసుపత్రితో పాటు మెడిలైఫ్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులలో టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులలో కేవలం మెడిలైఫ్‌నే ఎంపిక చేయడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మెడిలైఫ్ ఆస్పత్రికి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా మొదటి రోజు రెండు ఆస్పత్రుల పరిధిలో 60 మంది వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం రెండు ఆస్పత్రులలో 30 మంది చొప్పున సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపించారు. 16న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు టీకా పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు.