అంగన్‌వాడీ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-08-26T03:08:06+05:30 IST
ఈనెల1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి సావిత్రి పేర్కొన్నారు.

వాంకిడి, ఆగస్టు 25: ఈనెల1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి సావిత్రి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహిం చిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఅంగన్‌వాడీ కేంద్రాన్ని శానిటైజ్ చేసి ఉంచాలన్నారు. సెప్టెంబర్1 నుంచి పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా అవ గాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించాల న్నారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల న్నారు. యుక్తవయస్సు బాలికల ఆరోగ్యం, బాల్య వివాహాలు, గర్భిణీ, బాలిం తలు, చిన్నపిల్లలకు అందించే పోషకాహారాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీవో రిబ్కా, ఉమెన్ వెల్ఫేర్ అధికారి శారద, సూపర్‌వైజర్ రజిత, పోషన్ అభియాన్ కోఆర్డి నేటర్ తోఫిక్, సోషల్‌వర్కర్ ప్రవీణ్ కుమార్, చిల్డ్రన్ కౌన్సిలర్ నవీన్‌కుమార్, అంన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.