ప్రతి ఆస్పత్రిలో కొవిడ్ అవుట్ పేషంట్ సర్వీస్ అందించాలి
ABN , First Publish Date - 2021-05-06T04:08:02+05:30 IST
ప్రతి ఆస్పత్రిలో కొవిడ్ అవుట్ పేషంట్ సర్వీస్ అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, మే 5: ప్రతి ఆస్పత్రిలో కొవిడ్ అవుట్ పేషంట్ సర్వీస్ అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీ ల్దార్, మెడికల్ ఆఫీ సర్లు, మున్సిపల్ కమి షనర్‌లు, తదితర క్షేత్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలె క్టర్లతో కొవిడ్ నియం త్రణకు తీసుకోవా ల్సిన చర్యలు, జాగ్ర త్తలపై వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక, కమ్యూనిటీ, ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్‌సెంటర్లలో కొవిడ్ అవుట్ పేషంట్ సేవలు గురువారం నుంచి ప్రారంభిం చాలని ఆదేశించారు. అందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సల్ స్ర్కీనింగ్‌ను ప్రతిగ్రామంలో, పట్టణంలో నిర్వహించాలన్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక టీం చొప్పున ఏర్పాటుచేసి స్ర్కీనింగ్ నిర్వహించాలన్నారు. లక్షణాలు ఉన్న వారికి కొవిడ్ కిట్‌లను అందించి తప్పనిసరిగా వాడే విధంగా అవగాహన కల్పించాల న్నారు. స్ర్కీనింగ్ నిర్వహించే టీంలో మూడునుంచి నలుగురు సభ్యులు ఉండాలని ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్త, గ్రామరెవెన్యూ అధి కారి, వీఏవో, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోల సేవ లను వినియోఇంచుకోవాలని సూచించారు. ఆయా తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్‌లు టీంలను తయారు చేసి బుధవారం రాత్రిలోగా నివే దిక సమర్పించాలని అన్నారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ గురువారం నుంచి క్షేత్రస్థాయిలో టీంలు పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ చేప ట్టాలని అన్నారు.
కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే పేషంట్‌లకు ఆహ్లాదపరిచే విధంగా మ్యూజిక్, మంచిచిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు కొవిన్ యాప్, మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ విధానం ద్వారా పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. అందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో స్థానికసంస్థల అద నపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఎంహెచ్‌వో డా నరేందర్ రాథోడ్, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధి కారి కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, రిమ్స్ డైరె క్టర్ బి బలారాం, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎంపీ డీవోలు, తహసీల్దార్‌లు, జిల్లా అధికారులు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.