రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌గా కొక్కుల ప్రదీప్‌

ABN , First Publish Date - 2021-08-27T06:26:30+05:30 IST

రైతుబంధుసమితి జిల్లా డైరెక్టర్‌గా ఖానా పూర్‌కు చెందిన కొక్కులప్రదీప్‌ నియమితులయ్యారు.

రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌గా కొక్కుల ప్రదీప్‌
నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

నిర్మల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : రైతుబంధుసమితి జిల్లా డైరెక్టర్‌గా ఖానా పూర్‌కు చెందిన కొక్కులప్రదీప్‌ నియమితులయ్యారు. ఖానాపూర్‌ నుండి రైతుబంధు సమితి కన్వీనర్‌గా ఉన్న పుప్పాలశంకర్‌ ఇటీవల ఖానాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గా నియమితులవ్వడంతో ఆయన స్థానంలో ప్రదీప్‌ను నియమించాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రతిపాదనలు పంపగా ఆమె ప్రతిపాదనల మేరకు అధి కారులు ప్రదీప్‌ను డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు జారీ చేసిన నియామక పత్రాన్ని ఖానాపూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ కొక్కుల ప్రదీప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కష్టపడి పని చేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. తనకు జిల్లాలో సముచిత గౌరవం కల్పించిన ఎమ్మెల్యే రేఖానాయక్‌, అం దుకు సహకరించిన స్థానిక పార్టీ శ్రేణులకు కొక్కుల ప్రదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-08-27T06:26:30+05:30 IST