కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కిట్లు అందజేయాలి

ABN , First Publish Date - 2021-05-08T06:31:10+05:30 IST

ఇంటింటా సర్వేలో భాగంగా కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సకాలంలో కిట్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు.

కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కిట్లు అందజేయాలి
రత్నాపూర్‌ కాండ్లిలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌

సోన్‌, మే 7 : ఇంటింటా సర్వేలో భాగంగా కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సకాలంలో కిట్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. శుక్రవారం నిర్మల్‌ రూరల్‌ మండలంలోని రత్నాపూర్‌ కాండ్లి గ్రామంలో జరుగుతున్న ఇంటింటా సర్వేను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కోవిడ్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సిబ్బంది కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారి వివరాలు తెలుసుకొని సంబంధిత ఆరోగ్య కేంద్రాల్లో అందజేయాలన్నారు. కోవిడ్‌ నివారణ కోసం ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. సర్వేలో పూర్తి వివరాలు సేకరించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నివారణ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి ధన్‌రాజ్‌, గ్రామసర్పంచ్‌ లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌, సిబ్బంది, గ్రామస్థులు 

లక్ష్మణచాందలో ఆకస్మిక  పర్యటన

లక్ష్మణచాంద, మే 7 : నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని చామన్‌పెల్లిలో గల వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సలహలు, సూచనలు అందజేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు గోనె సంచులు వెంటనే పంపిస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక తహసీల్దార్‌ కవితారెడ్డి, ఎంపీడీవో మోహన్‌, సర్పంచ్‌ పడిగెల గంగాధర్‌, ఉపసర్పంచ్‌ కొమ్మోజి రమణ, కేంద్ర నిర్వాహకుడు కొమ్ముల మహిపాల్‌ రెడ్డి, రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-05-08T06:31:10+05:30 IST