పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి
ABN , First Publish Date - 2021-08-26T04:00:39+05:30 IST
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నా రు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 174 మందికి మంజూ రైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎఎస్ చైర్మన్లు లింగన్న, సురేష్, వైస్‌ఎంపీపీ అనిల్‌కుమార్, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

దండేపల్లి, ఆగస్టు 25: పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నా రు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 174 మందికి మంజూ రైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎఎస్ చైర్మన్లు లింగన్న, సురేష్, వైస్‌ఎంపీపీ అనిల్‌కుమార్, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
భీమారం: కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు అండగా నిలు స్తుందని తహసీల్దార్ జ్యోత్స్న పేర్కొన్నారు. బుధవారం చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ సుమన్, జడ్పీటీసీ భుక్య తిరుమల లక్ష్మణ్‌నాయక్, ఆర్‌ఐ అరుణలతో కలిసి 13 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.