ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-07-08T06:31:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలి
అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న బీజేవైఎం నాయకులు

- బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్‌

 జగిత్యాల అర్బన్‌, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్‌ చౌరస్తాలో ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశలతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తోందన్నారు. ఏడేళ్లు గడిచినా ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తన కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్న సీఎం కేసీఆర్‌ విద్యార్థి, నిరుద్యోగులను రోడ్డున పడేశారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని జగదీష్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్ష 94వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి అందిం చాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్‌కుమార్‌, బీజేవైఎం నాయకులు మల్యాల తిరుపతి, భైన ప్రశాంత్‌, ఉమేష్‌, మర్రిపెల్లి గంగాధర్‌, గుర్రం రంజిత్‌రెడ్డి, కోండ్ర రవితేజ, ప్రేమ్‌సాగర్‌, వెంకటేష్‌, వినీత్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-08T06:31:01+05:30 IST