పోస్టింగులకు మార్గదర్శకాలు జారీ

ABN , First Publish Date - 2021-12-25T05:56:09+05:30 IST

కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకా లను ప్రభుత్వం విడుదల చేసిందని అద నపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాం బాబు తెలిపారు.

పోస్టింగులకు మార్గదర్శకాలు జారీ
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్లు

నేడు జాబితా ప్రకటన ఫ 28, 29న కౌన్సిలింగ్‌

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 24 : కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకా లను ప్రభుత్వం విడుదల చేసిందని అద నపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాం బాబు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసి న జిల్లా అధికారుల సమావేశంలో మా ట్లాడుతూ... కౌన్సిలింగ్‌ ద్వారా కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించి ఉద్యోగుల నుండి ఆప్షన్లు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా శాఖాధిపతులు వారం రోజుల్లో ప్రక్రియ పూర్తికి ఆదే శించారు. సీనియారిటీ జాబితా సమర్పించాలని సూచించారు. 25న సీనియారిటీ అలాట్మెంట్‌, 26, 27 ఆప్షన్ల స్వీకరణ 28, 29 కౌన్సిలింగ్‌ నిర్వహించి 30న బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. డీఎఫ్‌వో వికాస్‌ మీనాతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:56:09+05:30 IST