భైంసా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

ABN , First Publish Date - 2021-06-22T07:21:14+05:30 IST

భైంసా ఏఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ కారే సోమవారం భైంసారూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు.

భైంసా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ
రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న కిరణ్‌కారే

భైంసా రూరల్‌, జూన్‌ 21 : భైంసా ఏఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ కారే సోమవారం భైంసారూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ రికార్డులను, సిబ్బంది పని తీరును, సిబ్బంది పట్టిక, నేరాల నమోదు, తదితర రికార్డుల ను పరిశీలించారు. నేరాలకు సంబంధించిన వివ రాలను ఏఎస్సై బాలుసింగ్‌ను అడిగి తెలుసుకు న్నారు. నేరాల అదుపునకు తీసుకోవాల్సిన తగు సూచనలను చేశారు. ఆయన వెంట రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ ఉన్నారు. 


Updated Date - 2021-06-22T07:21:14+05:30 IST