సమస్యలు ఉంటే తెలియజేయాలి
ABN , First Publish Date - 2021-01-13T05:19:04+05:30 IST
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించక పోతే తమ దృష్టికి తీసుకురావాలని భారతీయ కిసాన్‌సం్‌ఘ జిల్లా ఉపాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్ టౌన్, జనవరి 12: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించక పోతే తమ దృష్టికి తీసుకురావాలని భారతీయ కిసాన్‌సం్‌ఘ జిల్లా ఉపాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. సమావేశంలో సభ్యులు సాయిరెడ్డి, రాము, రైతులు పాల్గొన్నారు.