Huzurabad ఉప ఎన్నికల కౌంటింగ్ రౌండ్ టు రౌండ్ అప్డేట్స్.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్..!
ABN , First Publish Date - 2021-11-02T15:36:30+05:30 IST
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. తెలంగాణ సమాజం కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా చూస్తోంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. హుజురాబాద్‌లో ముక్కోణ పోరు నెలకొన్నప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యనే టఫ్‌ఫైట్ ఉంటుందనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో కౌశికర్ రెడ్డి చూపినంత ప్రభావం చూపుతారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. మంగళవారం హుజూరాబాద్‌లో జరుగుతున్న కౌంటింగ్ వివరాల మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకోసం..
22వ రౌండ్ ముగిసేనాటికి బీజేపీ అభ్యర్థికి 23,865 ఓట్ల మెజారిటీ ఉంది.