ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణా కోసం డ్రైవర్ల నియామకం

ABN , First Publish Date - 2021-05-02T06:25:43+05:30 IST

ఆదిలాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సహకారంతో నలుగు రు ఆర్టీసీ డ్రైవర్లను ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌ నడపడానికి నియామకం చేశామని ఆ దిలాబాద్‌ ఉపరవాణా కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆ దివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నెలరోజులుగా ప్రభుత్వ ఆదే శాలతో రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్‌ పాపారావు పనిచేస్తూ రవాణా శాఖ ఆధ్వర్యంలో అనేక మంది ఎంవీఐలను, ఏఎంవీఐలను ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌ ను మానిటర్‌ చేయడానికి నియమించారన్నారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణా కోసం  డ్రైవర్ల నియామకం

ఆదిలాబాద్‌అర్బన్‌, మే1: ఆదిలాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సహకారంతో నలుగు రు ఆర్టీసీ డ్రైవర్లను ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌ నడపడానికి నియామకం చేశామని ఆ దిలాబాద్‌ ఉపరవాణా కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆ దివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నెలరోజులుగా ప్రభుత్వ ఆదే శాలతో రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్‌ పాపారావు పనిచేస్తూ రవాణా శాఖ ఆధ్వర్యంలో అనేక మంది ఎంవీఐలను, ఏఎంవీఐలను ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌ ను మానిటర్‌ చేయడానికి నియమించారన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఏ ఎంవీఐ హరీంద్రకుమార్‌, ఏఎంవీఐ రాజమల్లు పదిహేను రోజులుగా విశాఖప ట్నంలో, ఏఎంవీఐ సంతోష్‌ కుమార్‌, ఏఎంవీఐ శ్రీనివాస్‌ అంగుల్‌ ఒడిశాలో ఉన్నారన్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌ను తెలంగాణకు తగిన సంఖ్యలో తరలించే లా మానిటరింగ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-02T06:25:43+05:30 IST