ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులను అరికట్టాలి
ABN , First Publish Date - 2021-10-30T03:48:28+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో, డయా గ్నస్టిక్ సెంటర్లలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నా ర ని, వీటిని నివారించాలని సీపీ ఐ, సీపీఎం నాయకులు శుక్ర వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల ఏసీపీకి వినతి పత్రాలు అందించారు.

మంచిర్యాల కలెక్టరేట్, అక్టో బరు 29: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో, డయా గ్నస్టిక్ సెంటర్లలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నా ర ని, వీటిని నివారించాలని సీపీ ఐ, సీపీఎం నాయకులు శుక్ర వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల ఏసీపీకి వినతి పత్రాలు అందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, లాల్‌కుమార్‌లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వం దకు పైగా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయని, టెస్టుల పేరుతో అధిక ఫీజులు చేస్తున్నారని, దీంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరల పట్టిక బోర్డు ప్రదర్శించాలని, అనర్హులతో నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.