దడ పుట్టిస్తున్న దరఖాస్తులు!

ABN , First Publish Date - 2021-05-02T06:23:10+05:30 IST

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని పంచాయతీలకు స.హ. దరఖాస్తులు దడ పుట్టిస్తున్నాయి. ఆదిలాబాద్‌ రూరల్‌, బేల, జైనథ్‌ మండలాల్లోని అన్ని పంచాయతీలకు స మాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి పంచాయతీ ల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలను ఇవ్వాలని మండల పరిషత్‌ అధికారి (ఎంపీఓ)కు దరఖాస్తు చేయడంపై అధికారవర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

దడ పుట్టిస్తున్న దరఖాస్తులు!
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల కలకలం

పంచాయతీ రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించిన అధికారులు

సర్పంచ్‌, కార్యదర్శుల్లో గుబులు  

ముడుపులు ముట్టచెప్పేందుకు రంగం సిద్ధం

చోద్యం చూస్తున్న జిల్లాస్థాయి యంత్రాంగం

ఆదిలాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని పంచాయతీలకు స.హ. దరఖాస్తులు దడ పుట్టిస్తున్నాయి. ఆదిలాబాద్‌ రూరల్‌, బేల, జైనథ్‌ మండలాల్లోని అన్ని పంచాయతీలకు స మాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి పంచాయతీ ల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలను ఇవ్వాలని మండల పరిషత్‌ అధికారి (ఎంపీఓ)కు దరఖాస్తు చేయడంపై అధికారవర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

మొదట బేల మండలం, ఆదిలాబాద్‌రూరల్‌ మండలాలకు దరఖాస్తు చేసిన తర్వాత తాజాగా జైనథ్‌ మండల ఎంపీవోకు దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. అవినీతి, అక్రమాలను బయట పెట్టేందుకు బ్రహ్మాస్త్రమైన స.హా చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి ఒకే వ్యక్తి మూడు మండలాల పరిధిలోని 110 పంచాయతీలకు దరఖాస్తు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విషయంపై సహా చట్టం కింద దరఖాస్తు చేసి అందిన సమాచారంతో అక్రమాలు జరిగినట్లయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంటుంది. న్యాయ స్థానానికి వెళ్లి న్యాయ పోరాటం చేసేందు కు వీలుంటుంది. కా నీ, ఇది ఇక్కడ దరఖాస్తు చేసిన సద రు వ్యక్తి కేవలం రికార్డుల పరిశీలనకు దరఖాస్తు చేయడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. సరైన ఆధారం లేకుండానే అవినీతి అక్రమాలను బయట పెట్టడం ఎలా సాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పంచాయతీ ఖ ర్చు వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఎప్పటికప్పుడు నమోదవుతున్నాయి. మొత్తానికి ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో ని అన్ని గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయ వివరాలను కోరడం అంతటా హాట్‌ టాపిక్‌గా మారుతుంది.

నిబంధనలు వర్తిస్తాయి..

పంచాయతీల రికార్డుల వివరాలను ఇవ్వాలని దరఖాస్తు చేసిన సదరు వ్యక్తికి నిబంధనలు వర్తిస్తాయన్న షరతులు విధించారు. ఒక్కో జిరాక్స్‌ కాపీకి రూ.2 చెల్లించాలని సూచించారు. కానీ, అంత డబ్బు తనవద్ద లేదని సమాధానమి స్తూ దరఖాస్తు పెట్టుకోవడంతో రికార్డుల పరిశీలనకే అవకాశం కల్పి స్తూ పంచాయతీ పని దినాలలో ఏ పంచాయతీకైనా వెళ్లి అడిగిన రికార్డులను పరిశీలించే అవకాశం ఇచ్చారు. సంబంధిత రికార్డులు జిరాక్స్‌ తీయడం, ఫొటోతీయడం లాంటివి చేయరాదనే నిబంధనలు విధించారు. గంటకు మించి రికార్డులు పరిశీలించిన సదరు వ్యక్తి రూ.5 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. స.హ. చట్టం ప్రకారమే దరఖాస్తుదారునికి రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు మండ ల స్థాయి అధికారులు అన్ని పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. 

తలో కొంత ఇచ్చేందుకు..

స.హ. దరఖాస్తుతో ఎందుకొచ్చిన ఇబ్బంది అనుకున్నారో ఏమోకాని గ్రామ కార్యదర్శులందరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తలోకొంత సోమ్మును పోగు చేసి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వినిపిస్తుంది.ఇప్పటికే కొందరు పంచాయతీ కార్యదర్శులు రూ.500ల నుంచి రూ.1000 వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తుంది. మండల స్థాయి అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్న ఆదేశాలు ఇవ్వడంతో అప్రమతమవుతున్నారు. అసలే కొత్తగా విధుల్లోకి చేరిన కొందరు పంచాయతీ కార్యదర్శులు అయోమయానికి గురవుతున్నారు. రికార్డుల పరిశీలనకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందనే ఆందోళన కనిపిస్తుంది. అయితే ఇదంతా బహిరంగానే జరిగి పోతున్న జిల్లా ఉన్నతాధికారులు మాత్రం తమకేమి తెలియదన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఈ విషయమై కొందరు సర్పంచ్‌లు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. 

ఏం జరుగుతుందోనన్న ఆందోళన...

స.హ. దరఖాస్తు చేసిన వ్యక్తికి మండల స్థాయి అధికారులు పంచాయతీల వివరాలు, రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించడంతో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శుల్లో ఏం జరుగుతుందనే ఆందోళన కనిపిస్తుంది. కొంత కా లంగా పంచాయతీలకు ప్రభుత్వం నెలనెల నిధులను విడుదల చేయడంతో గ్రామాల్లో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్ర మంలో ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగడానికి అవకాశం ఉంటుం దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తమ గ్రామానికి రావద్దంటూ రా యబారం పెడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వచ్చిన అందుబాటులో లేరని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ముందు నుంచి పంచాయతీ లెక్కలన్నీ గందరగోళంగానే ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. నామ్‌కే వాస్తేగా ఆడిట్‌ చేయడం, రికార్డులను మూలన పడేయడం పరిపాటిగానే మారింది. మండల స్థాయి అధికారులు కూడా అడపదడపగా పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడం అందనికాడికి దండుకోవడం అంతా ఒకేనంటూ ధ్రువీకరించడం అలవాటుగానే మారింది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే ఇబ్బందికరంగా మారుతుందనే భయం వెంటాడుతుంది. 

రికార్డుల పరిశీలనకు అనుమతిచ్చాం..

వెంకట్‌రాజు (ఎంపీవో, జైనథ్‌ మండలం)

స.హ. దరఖాస్తు చేసిన వ్యక్తికి మండల పరిధిలోని 42 పంచాయతీల రికార్డుల పరిశీలనకు అనుమతినిచ్చాం. స.హ. చట్టం ప్రకారమే పలు సెక్షన్ల కింద అనుమతులు ఇవ్వడం జరిగింది. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలనకు ఇవ్వాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చాం. మాముళ్ల విషయంపై నాకు ఎలాంటి సంబంధం లేదు.

Updated Date - 2021-05-02T06:23:10+05:30 IST