టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన హర్షద్‌ హుస్సేన్‌

ABN , First Publish Date - 2021-08-28T03:35:29+05:30 IST

మండల ప్రాథమిక వ్యవ సాయసహకార సంఘం చైర్మన్‌ హర్షద్‌హుస్సేన్‌ శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన హర్షద్‌ హుస్సేన్‌
మాట్లాడుతున్నహర్షద్‌ హుస్సేన్‌

బెజ్జూరు, ఆగస్టు 27: మండల ప్రాథమిక వ్యవ సాయసహకార సంఘం చైర్మన్‌ హర్షద్‌హుస్సేన్‌ శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆ ర్‌ ఎస్‌ పాలన పనితీరు నచ్చక తనతోపాటు మరి కొంతమంది పార్టీకి రాజీనామాచేసి శనివారం బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ తన రాజీనామా పత్రాన్ని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-28T03:35:29+05:30 IST