కొనసాగుతున్న హమాలీల సమ్మె

ABN , First Publish Date - 2021-02-20T04:19:47+05:30 IST

కార్మిక సంఘాలతో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎల్‌ఎస్‌ గోదాం ఆవరణలో నిర్వహిస్తున్న హమాలీల సమ్మె రెండో రోజుకు చేరుకుంది.

కొనసాగుతున్న హమాలీల సమ్మె
బెజ్జూరులో దీక్షలో కూర్చున్న హమాలీలు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 19: కార్మిక సంఘాలతో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎల్‌ఎస్‌ గోదాం ఆవరణలో నిర్వహిస్తున్న హమాలీల  సమ్మె రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం  ఒంటి కాలిపై నిలబడి హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌, నాయకులు సుధాకర్‌, హేమాజీ, దివాకర్‌, శ్రీనివాస్‌, తరుణ్‌, సురేష్‌, తిరుపతి పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌ టౌన్‌:  హమాలీ కార్మికులు కాగజ్‌నగర్‌లో చేపడుతున్న నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఏఐటీ యూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ మాట్డాడారు. సమ్మెలో జిల్లా కార్యదర్శి కుమార్‌, సత్యనారాయణ, నాయకులు సుధాకర్‌, ఆరేశ్‌, తిరుపతి, కిషన్‌, అంజయ్య పాల్గొన్నారు.
సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని సివిల్‌ సప్లయి గోదాం ఎదుట హమాలీలు డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె శుక్రవారం కొనసా గించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
బెజ్జూరు: మండల కేంద్రంలోని సివిల్‌ సప్లయీస్‌ గోదాం ఎదుట హమాలీలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో హమా లీల సంఘం నాయకులు శ్రీను, వెంకటి, శంకర్‌, బాపురావు, రమేష్‌, దొంతు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-20T04:19:47+05:30 IST