గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-09-03T07:04:35+05:30 IST

పట్టణంలో నిల్వ ఉంచిన గోడౌన్‌లో గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుట్కా పట్టివేత

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 2: పట్టణంలో నిల్వ ఉంచిన గోడౌన్‌లో  గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిరు వ్యాపారులకు దొంగచాటున సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే గురువారం ఎస్సై మహ్మద్‌కలీంతో కలిసి భుక్తాపూర్‌ కాలనీలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇదే కాలనీకి చెందిన నిందితుడు షేక్‌ సమీర్‌ దాచి ఉంచిన గోదాంలో తనిఖీ చేసి రూ.80వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో టాస్క్‌ఫోర్స్‌ ఏఎస్సై తాజోద్దిన్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T07:04:35+05:30 IST