గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-08-21T05:38:33+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న గుట్కాను గురువారం అర్ధరాత్రి బెల్లూరి గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గుట్కా పట్టివేత

ఆదిలాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న గుట్కాను గురువారం అర్ధరాత్రి బెల్లూరి గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇచ్చోడ సీఐ కంప రవీందర్‌, గుడిహత్నూర్‌ ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి అర్ధరాత్రి  తరలిస్తున్న ఎంహెచ్‌ 26ఏడీ1706 నెంబర్‌ గల ఐచర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి ఆదిలాబాద్‌ వైపు వస్తున్న ఐచర్‌ వాహనంను పట్టుకుని గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై గుడిహత్నూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుట్కా విలువ రూ.17.5 లక్షలు ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2021-08-21T05:38:33+05:30 IST