ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-05-21T07:03:11+05:30 IST
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చే యాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు.

సోన్, మే 20 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చే యాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. గురువారం మండ ల కేంద్రంతో పాటు పాక్‌పట్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద నుండి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ధాన్యంను కొనుగోలు చేయాలన్నారు. నా ణ్యమైన వరిధాన్యంను వెంటది వెంటనే తూకం వేసి రైస్‌మిల్లర్లు తర లించా లని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతివనాన్ని గ్రామంలో ఓపెన్ జిమ్ కొరకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలె క్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్‌వో రాథోడ్ రమేష్, తహసీల్దార్ అరిఫా సుల్తానా, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్‌రెడ్డి, సోన్, పాక్‌పట్ల సర్పంచ్‌లు వినోద్‌కుమార్, ఎల్‌చల్ గంగారెడ్డి, సిబ్బంది, రైతులు ఉన్నారు.
గన్నీ సంచులు, లారీల కోసం కలెక్టర్‌కు వినతి
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలె క్టర్ ముషారఫ్ అలీకి రైతులు ఇబ్బందులను విన్నవించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డితో పాటు రైతులు గన్నీ బ్యాగులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని విన్నవించారు. సరైన సమ యానికి ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
మే నెల చివరి నాటికి పూర్తి చేయాలి
నిర్మల్ టౌన్, మే 20 : వరి ధాన్యం కొనుగోళ్లను మే నెల చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తహసీల్దార్‌లను ఆదేశించారు. గురువారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్ని మండలాల తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎంపీలు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టిసారించి రోజువారిగా ఎంత కొనుగోలు జరిగింది ఎప్పటికప్పుడు రిపోర్ట్ సమర్పించాలని తహసీ ల్దార్‌లను ఆదేశించారు. ముఖ్యంగా సోన్, నిర్మల్, సారంగాపూర్‌లలో ఇబ్బందు లు తలెత్తుతున్నాయని అన్నారు. లారీలు అందుబాటులో లేకుంటే ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని, తహసీల్దార్లు తమవంతు బాధ్యతగా పకడ్బందీగా చర్యలు చేపట్టి ఈ నెల 31 లోగా జిల్లాలో కొనుగోలు కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు అన్ని సెంటర్‌లకు పంపించడం జరిగిందని, ఎక్కడ కూడా గన్నీ బ్యాగుల కొరత లేదని ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బ్యాగులను రైస్ మిల్లులకు చేర్చాలని, ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు చేయాలని తెలిపారు. మండలాల వారిగా ఒక్కొ క్కరిని వరి ధాన్యం కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగం సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్క రించాలని తెలిపారు. రోజు రోజుకూ వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతుండడంతో ఎంపీడీవోలు వరి ధాన్యం కొనుగోలుపై ఫోకస్ పెట్టాలని, అందరి సహకారంతో ఈ నెల చివరి నాటికి ప్రతి మండలంలో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి గ్రామంలో ప్లే గ్రౌండ్ ఉండాలని దాని కొరకు 2 ఎకరాల ల్యాండ్ ఐడెంటీఫై చేయాలని, వాలీబాల్, ఫుట్ బాల్, సింగిల్ బాస్కెట్ బాల్ ఉండే విధంగా ఈ నెల 25 వరకు ల్యాబ్ ఐడెంటీఫై చేసి జూన్ 2న ప్రారంభోత్సవం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, పి. రాంబాబు, సివిల్ సప్లై కిరణ్ కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.