పెళ్లిచూపుల్లో అమ్మాయికి నచ్చలేదేమోనని..

ABN , First Publish Date - 2021-10-30T05:05:36+05:30 IST

పెళ్లిచూపుల్లో అమ్మాయికి నచ్చలేదేమోనని..

పెళ్లిచూపుల్లో అమ్మాయికి నచ్చలేదేమోనని..

రైలు కిందపడి ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య 

వరంగల్‌ రైల్వేగేటు వద్ద ఘటన  


గిర్మాజిపేట, అక్టోబరు 29: ఇటీవల పెళ్లిచూపులకు వెళ్లి వచ్చాడా యువ ప్రభుత్వ ఉద్యోగి. రెండు రోజులైనా అమ్మాయి తరపు నుంచి ఎలా ంటి సమాచారం రాకపోవడంతో తాను నచ్చలేదేమోనని ఆందోళన చెందాడు. సోదరుడు సముదాయించినా అతడు వినలేదు. ఈ క్రమం లో తీవ్ర ఆవేదనతో ఆ ప్రభుత్వ ఉద్యోగి రైలు కిందపడి తనువు చాలించాడు. వరంగల్‌ రైల్వే గేట్‌ సమీపంలోని చిన్న బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ వి.నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

వరంగల్‌ ఉర్సు బొడ్రాయి ప్రాంతానికి చెందిన రామచందర్‌ ఏఎ్‌సఐగా పనిచేస్తూ విధినిర్వహణలో 2013లో మృతిచెందాడు. ఇతడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు సిలువేరు రంజిత్‌కుమార్‌(29) మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం లో ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండి మరణంతో 2014లో కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరా డు. మూడో కుమారుడు ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహమైంది. కాగా రంజిత్‌కుమార్‌ తల్లి కళావతితో కలిసి ఉర్సు బొడ్రాయి ప్రాం తంలో నివాసముంటున్నాడు. ప్రతీ రోజు ఉద్యోగానికి వరంగల్‌ నుంచి మహబూబాద్‌కు రైలు లో వెళ్లి వస్తుంటాడు. బుధవారం రంజిత్‌కుమార్‌ పెళ్లిచూపుల కోసం హనుమకొండ జిల్లా అం బాల గ్రామానికి వెళ్లి అమ్మాయిని చూసి వచ్చా డు. రెండు రోజులు గడిచినా అమ్మాయి కుటుం బం నుంచి సమాచారం రాలేదు. దీంతో రంజిత్‌కుమార్‌ ఆందోళనతో తన అన్న మురళీధర్‌ వద్ద ప్రస్తావించాడు. ‘పెళ్లిచూపులు జరిగి రెండు రోజులే అయింది కదా.. అమ్మాయి వారు ఆలోచించుకుని చెబుతారు.. తొందరపడొద్దు’ అని సముదాయించాడు. అయితే తాను అమ్మాయికి నచ్చకపోవడంతోనే వారి నుంచి సమాచారం రాలేదని భా వించిన రంజిత్‌కుమార్‌ తీవ్ర కల త చెందాడు. గురువారం రాత్రి బయటకు వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లి వరంగల్‌ రైల్వేగేట్‌ సమీపంలోని చిన్నబ్రిడ్జి వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రంజిత్‌కుమార్‌ తాను రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్నట్లు అతడి బావ అబ్రహంకు ఫోన్‌ చేసి చెప్పగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో వారు వరంగల్‌ జీఆర్పీ స్టేషన్‌కు వచ్చి సమాచారం అందించారు. అదే సమయంలో చిన్నబ్రిడ్జి వద్ద మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం రంజిత్‌కుమార్‌దేనని అతడి సోదరులు గుర్తించారు. మృతుడి వద్ద ఉద్యోగి గుర్తింపుకార్డు, వరంగల్‌- మహబూబాబాద్‌ రైల్వే సీజన్‌ పాస్‌ లభించాయని సీఐ తెలిపారు. రంజిత్‌కుమార్‌ మృతితో అతడి కుటుంబాన్ని శోకసంద్రంలో మునిగిపోయింది. శుక్రవారం ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.సత్తయ్య కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-30T05:05:36+05:30 IST